Monday, December 23, 2024

మాజీ డిప్యూటీ మేయర్​కు హైకోర్టులో ఊరట

  • జూన్ 13 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం

నేటి సాక్షి, కరీంనగర్​ క్రైం: కరీంనగర్​ ఎంఐఎం నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. మే 14న దళిత యువకుడిపై దాడి అంశంలో అబ్బాస్​ సమీతోపాటు పలువురిపై కొత్తపల్లి హవేలీ పోలీస్ స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ5గా అబ్బాస్ సమీ ఉన్నారు. కొన్ని రోజులుగా అబ్బా సమీ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్​ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం జూన్ 13 వరకు అబ్బాస్ సమీని అరెస్టు చేయొద్దని కొత్తపల్లి పోలీసులను ఆదేశించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News