Saturday, March 14, 2026

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అరెస్ట్ ను ఖండించిన గొల్లపల్లి బీ.ఆర్.ఎస్ మండల నాయకులు*

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాలును స్వీకరించి హైదరాబాద్ లోని 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినందుకు గొల్లపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా కండించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి పై చర్చకు రమ్మని రాకుండా తప్పించుకుందే కాకుండా పోలీసులతో నిర్భందించడం ఎంతవరకు సమాజసమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. బీ.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో చేసిన అభివృద్ది పై ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియక చర్చకు రాలేదు అనే విషయం తెలంగాణ ప్రజలకు మరియు ముఖ్యంగా ధర్మపురి ప్రజలకు కూడా అర్థమవుతుంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేయడం కాదు చేసిన సవాల్ ను నిలబట్టుకోనే దైర్యం ఉండాలని మాట్లాడినారు.నక్క శంకర్ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం లో సర్కారు కాకుండా సర్కాసు నడిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నారు.ప్రభుత్వం పనులు చేయాల్సింది పోయి కమిషన్ ల కోసం మంత్రులు కొట్టుకునే స్థాయికి వచ్చిందన్నారు. సంక్షేమ శాఖ మంత్రి సవాల్ విసిరి స్వీకరించి వచ్చిన తరువాత తోక ముడిచారు అన్నారు.మీరు చేసే సర్కాసు తో ప్రజలు విసిగిపోయారు అన్నారు. జూబ్లీ హిల్స్ లో మీకు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు నల్ల శ్యామ్ మాట్లాడుతూ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద చర్చ కి సిద్ధమా అని సవాల్ విసిరి, సవాల్ స్వీకరించిన తరువాత వచ్చిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అరెస్ట్ చెపించడం అప్రజాస్వామికం అన్నారు.మీ ప్రభుత్వం లో ఎం జరిగిందో చర్చ కి రాకుండా అరెస్టు చేయడం మీ యొక్క అసమర్థ పాలన కి అద్దం పడుతుంది అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుగుతున్న పరిణామాలు అన్ని గమనిస్తున్నారు అన్నారు.గోస్కుల రాజన్న మాట్లాడుతూ బి అర్ ఎస్ హయం లో జరిగిన అభివృద్ధి తట్టుకోలేక అధికారం లోకి వచ్చిన తరువాత కూడా పాలన చేయకుండా ప్రతిపక్షం మీద నెపలు వేస్తూ కాలం వెల్లదిస్తున్నారు అన్నారు.ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న తట్టెడు మట్టి కూడా పోయని అసమర్థ ప్రభుత్వం అని అన్నారు.సవాల్ వేసే ముందు ఆలోచించుకొని వేయాలి అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ నక్క శంకరయ్య,బి.ఆర్.ఎస్ పార్టీ మండల కో-ఆర్డినేటర్ బోయపోతు గంగాధర్,మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ కనుకుట్ల లింగరెడ్డి, గొల్లపల్లి మాజీ ఉప సర్పంచ్ మారం రాజశేఖర్,మాజీ సర్పంచులు నల్ల శ్యామ్, సిద్దంకి మల్లారెడ్డి,మాజీ ఎంపీటీసీ గోలి లక్ష్మీ గంగరెడ్డి, గోస్కుల రాజన్న, గోవిందుల లావణ్య జల్పతి, బొల్లం గంగరాజాం,బీసీ మండల అధ్యక్షులు బలభక్తుల కిషన్,విద్యార్ధి విభాగం మండల అధ్యక్షుడు ఆవరి చందు,మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్,కార్మిక శాఖ అధ్యక్షులు సామల వీరస్వామి బీ.ఆర్.ఎస్ మీడియా సెల్ అధ్యక్షులు కోమల్ల జలందర్,యూత్ మండల ఉపాధ్యక్షులు కూన రాజేందర్ నాయకులు కనుకుట్ల లింగరెడ్డి, కలకోట సత్యం,ఎరవేనీ కన్ను, పుట్టపాక సత్యం,తాండ్ర కిరణ్,ధావుల రాకేష్,గంగారెడ్డి, ముదాం రమేష్, బాపన్న తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News