నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………………కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి ఢిల్లీ రావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చారు.జగిత్యాలలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు జీవన్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి రావాలని ఏఐసిసి కార్యదర్శి కే సి వేణుగోపాల్ మంగళవారం జీవన్ రెడ్డికి ఫోన్ చేయడంతో ఆయన జగిత్యాల నుండి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కనుండి జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.జగిత్యాలలో బీఆర్ ఎస్ నుండి ఎమ్మెల్యే గా గెలిచినా సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుండి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు, జీవన్ రెడ్డి కి పార్టీలో, మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ల విషయంలో తీరని అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే పై మండిపడుతూ వస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా బీ ఆర్ ఎస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇప్పించుకున్నారని జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడారు.జగిత్యాల మున్సిపల్ లో 50 వార్డులుండగా జీవన్ రెడ్డి కి కేవలం 15 స్థానాలు కేటాయించి, ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 35 సీట్లు ఇవ్వడం పట్ల జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు.జీవన్ రెడ్డి 9 మంది కాంగ్రెస్ నుండి మరో 9 మంది స్వతంత్రులను కౌన్సిలర్లుగా తన అనుచరులను కస్టపడి గెలిపించుకున్న చైర్మన్ పదవి ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వడంతో ఎమ్మెల్యే తో నాకు పార్టీలో ముప్పు తప్పదని, నాకు పార్టీలో 40 ఏళ్లకు పైగా పని చేస్తున్న ఎమ్మెల్యే చేరికతో నా కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతుందని ఇంకా ఎన్నేళ్లు భరిస్తూ ఉండాలని మరోసారి అధిష్టానంపై జీవన్ రెడ్డి రెండు రోజుల క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీంతో అధిష్టానం తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని పిలుపురావడంతో తాడో.. పేడో తెల్చుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమై ఢిల్లీకి వెళ్లడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తిని రెకత్తిస్తోంది.

