బిఆర్ఎస్ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు కవిత శ్రీనివాస్ రెడ్డి
నేటిసాక్షి, జగదేవపూర్:
అసెంబ్లీ సాక్షిగా సీనియర్ మహిళ శాసనసభ్యులు, మాజీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అవమానించడం పట్ల బిఆర్ఎస్ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆమె జగదేవపూర్ లో మాట్లాడుతూ తెలంగాణ అంటేనే సాంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట అని వివరించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలను మహిళ అని కూడా చూడకుండా అసెంబ్లీ సమావేశాల్లో అవమాన పరచడం సరైంది కాదన్నారు. ఏ రాజకీయ నేత ఒకే పార్టీలో ఉండడం లేదని, ప్రజాసేవ కోసమే పార్టీలకు అతీతంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఇద్దరూ మాజీ మంత్రులు, ప్రస్తుతం శాసనసభ్యులను అవమాన పరచడం తెలంగాణ మహిళలను అవమామపరచడమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పేరిట మహాలక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టి చివరకు మహిళలలే అవమాన పరిచేలా చేయడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.