Saturday, March 21, 2026

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్….

నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 4,మాజీ ముఖ్యమంత్రి, ప్రకాశవంతమైన ప్రజా జీవితానికి ప్రతీకగా నిలిచిన కొణిజేటి రోశయ్య వర్థంతి సందర్భంగా నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…రోశయ్య రాజకీయాలలో దశాబ్దాల పాటు వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి, ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేసిన ప్రజా నాయకుడు అని అన్నారు. ఆయన నిర్వాహణా ప్రతిభ, సరళమైన జీవన విధానం ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, జిల్లా పోలీస్ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News