Tuesday, March 17, 2026

మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్.అధ్వారంలో ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పై నిరసనగాంధీ విగ్రహం వద్ద భారీ నిరసనలు

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 21 కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు నుంచి మహాత్మా గాంధీ.పేరును తొలగించి, దాని స్థానంలో.వికసిత్ భారత్.జి.రామ్.జి’ (VB-G RAM G) గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్ అద్వారంలో పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు గాంధీ విగ్రహం వద్దకు చేసుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. బీజేపీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం పేదల ఆకలి తీర్చే పథకం అని దీనికి గాంధీ పేరు తొలగించడం అంటే పేదలని మరియు జాతిపితను అవమానించడమే అని పేర్కొన్నారు.స్థానిక నాయకుల డిమాండ్లు:గ్రామ స్థాయి నాయకులు మాట్లాడుతూ,పేదల కడుపు నింపే పథకానికి గాంధీజీ పేరు ఉండటం దేశానికే గర్వకారణం. రాజకీయ కక్షతో పేరు మార్చడం దుర్మార్గం. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పాత పేరునే కొనసాగించాలి” అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్. మాజీ చైర్మన్ దస్తగీర్ షబ్బీర్ హుస్సేన్ యూసుఫ్ ఖాన్ మహేష్ ఉన్నా రమేష్ మహారాజ్ ముజంమిల్ సాబీర్ శ్రీకాంత్ మరియు షరీఫ్ మరియు కాంగ్రెస్.నాయకులు , కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News