Tuesday, March 17, 2026

మాజీ సర్పంచ్‌ కృష్ణయ్య మృతికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నివాళులు

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల) పాకాల మండలం, గానుగ పంట పంచాయతీ మాజీ సర్పంచ్‌ వీరిశెట్టికృష్ణయ్య మృతికి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నివాళులు అర్పించారు. గానుగపెంట పంచాయతీ చిన్న పాపయ్య గారి పల్లి గ్రామనికి చెందిన కృష్ణయ్య బుధవారం ఆకస్మికంగా మరణించారు. ఆ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆ ఇంటికి చేరుకుని కృష్ణయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో పాటు పాకాల మండల పార్టీ అధ్యక్షుడు నంగా నరేష్‌ రెడ్డి, ఎంపీపీ లోకనాథం, మునీర్‌ బాయ్, కపిలేశ్వర్‌ రెడ్డి, మునిరత్నం రెడ్డి, పవన్‌కుమార్, యతీష్‌రెడ్డి, చంటి, గురుదేవ్, గంగులు, వెంకటరమణారెడ్డి, రవి, నాగభూషణం, గిరిధర్‌లు నివాళి అర్పించిన వారిలో వున్నారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం హరిజనవాడకు చెందిన ఎంపీటీసీ రెడ్డెయ్య తండ్రి వెంకటముని రెండు రోొజుల క్రితం మరణించారు. ఆ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించిన వారిలో కుంట్రపాకం సర్పంచ్ శుభ పద్మనాభరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు కరమలవల్లీ, రఫిక్చె భాషాలు వున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News