నేటి సాక్షి డిసెంబర్ 29 తొగుట ప్రతినిధి.. నరసింహులుఅసెంబ్లీకి వెళ్లే మంత్రులు ఎమ్మెల్యేల్లారా మా తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురై సర్పంచులు చలో అసెంబ్లీ బాటబట్టి అసెంబ్లీ ముట్టడిస్తందుకు చేరుకుంటున్నారు అని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నర్సింలు యాదవ్ చందాపూర్ మాజీ సర్పంచ్ అన్నారు కొంత మంది సర్పంచులను హైదరాబాద్కు చేరుకోకుండా కట్టుదిట్టంగా వివిధ మండలాల్లో పోలీసులు అర్ధరాత్రి తాజా మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారు ఇది అన్యాయం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేసి దేశానికి ఆదర్శంగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినారు అలాంటివారు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై షష్టత ఇవ్వక కనీసం ప్రభుత్వం జ్ఞాపకం చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు ప్రజా పాలన ప్రభుత్వంలో తాజా మాజీ సర్పంచుల పై కక్ష సాధింపు సాధింపు ఎందుకు అన్నారు ఈ కార్యక్రమంలో తుక్కాపూర్ మాజీ సర్పంచ్ చిక్కుడు చంద్ర ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

