నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :వనపర్తి పట్టణం 8వ వార్డు శ్రీనివాసపురం మాజీ సర్పంచ్ ఉమ్మల్ల శాంతన్న మరణించిన విషయం కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాంతన్న పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇంటి పెద్ద ను కోల్పోవడం బాధాకరమని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. నివాళులర్పించిన నాయకులు రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య , జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, భాస్కర్, సురేష్, రాంజీ నాయక్ గుజ్జుల రాములు, ఉమ్మళ్ల అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

