Saturday, March 21, 2026

*మాటలాగారడితో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం*- *పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకుండా వైఎస్సార్సీపీ పై నిందలా:చెంగల్ రెడ్డి*-

నేటి సాక్షి తిరుపతి – (బాదూరు బాల) కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు దగాకు గురవుతున్నారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు విద్యారంగ ద్రోహులు చరిత్రపుటల్లోని నిలిచారంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు చెంగల్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజులు చెల్లించలేక పోవడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ రూపంలో రూ.4వేల కోట్లు ఫీజులు చెల్లించాడని ఆయన గుర్తు చేశారు. అంతకముందు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ రూ.1,882 కోట్లు విద్యార్థులకు బకాయిలు పెట్టారని, జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కూడా అందించిన ఘటన వైఎస్‌ జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. 18 నెలల చంద్రబాబు పాలనలో ఇప్పటి వరకు 8 త్రైమాసిక ఫీజులు బకాయిలు ఉన్నారని, సుమారు రూ.7,200 కోట్ల మేరకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చెలగాటమాడుతున్నారని మండిపడ్డాడు. ఫీజులను చెల్లించడం చేతకాకుండా ఆ బకాయిలన్నీ గత ప్రభుత్వ బకాయిలంటూ లోకేష్‌ బుకాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్, హాస్టల్‌ మెస్‌ బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌ ఉంచడంతో అవి కొండల్లా పేరుకు పోతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు చదువుతోపాటు భోజనం కూడా దక్కని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం స్త్రశారు. ఫీజు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిళ్లకు పాల్పడటంతో తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా ఈ చంద్రబాబు సర్కారు పన్నాగం పన్నుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్న మంత్రి లోకేష్‌ విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రూ.1,882కోట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్నాయని నిరూపించగలవా అంటూ ఆయన సవాల్‌ విసిరారు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన సర్కారు, చేసిన తప్పులను గత ప్రభుత్వాలపై రుద్దుతూ ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తాయంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌ గారడి మాటలు మాని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News