నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనమయ్యిందని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అన్ని కష్టాలే. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీ ఒకటి. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ గంగ పాలే. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు రూపుదిద్దేందుకు ఎన్నో సంస్కరణలు కలిగిన పథకాలను తీసుకొచ్చారు. పాఠశాలలు ప్రారంభం కాగానే స్కూల్ బ్యాగ్ తో సహా వాళ్లకు కావాల్సిన సామాగ్రి అంత అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు నాసి రకమైన బ్యాగులు సరఫరా చేసింది. క్వాలిటీ గల స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ రవిచంద్ర దుయ్యబట్టారు. ”పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని ఈ కూటమి ప్రభుత్వంలో ఆజ్యం పోశారు. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకమైన బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని మాటల గారడి ప్రభుత్వమిది. నాడు – నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని సంక నాకించారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని కూటమి ప్రభుత్వం మరి విద్యార్థులకు ఎలా విద్యాబుద్ధులు నేర్పుతుందని ఇవన్నీ చూస్తుంటే చేతగాని మంత్రి లోకేష్ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..~~~~~~~~~~~~~~~~





