నేటి సాక్షి – మెట్‌పల్లి*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మెట్‌పల్లి 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్ పటేల్ ఆదర్శంగా నిలిచారు. వార్డులో పేద కుటుంబంలో మరణం సంభవిస్తే తక్షణ సాయంగా రూ.5,000 అందజేస్తామని ప్రకటించిన మాటను అమలు చేస్తూ బాధిత కుటుంబానికి సహాయం అందించారు.*అనారోగ్యంతో మహిళ మృతి… కుటుంబానికి అండగా..*మెట్‌పల్లి పట్టణంలోని 15వ వార్డుకు చెందిన శ్రీపతి రత్న అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్ శనివారం వారి నివాసానికి చేరుకుని రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎన్నికల సమయంలో పేద కుటుంబాలకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ మేరకే ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.*సైనిక్ ఫౌండేషన్ తరఫున బియ్యం బస్తా*అదేవిధంగా సైనిక్ ఫౌండేషన్ తరఫున 25 కిలోల బియ్యం బస్తాను బాధిత కుటుంబానికి అందించారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని, వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ, సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరిగెల రాకేష్ పటేల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఎన్నికల హామీని అమలు చేయడం ద్వారా ప్రజా ప్రతినిధులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన కౌన్సిలర్‌కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు._______





