ఇండ్లపై నుండి వెళ్ళిన 11కేవీ కరెంట్ తీగలు తొలగింపు..
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు..
పాలేరు , జూన్ 25 (నేటి సాక్షి):
ఎన్నో ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న విద్యుత్ తీగల తొలగింపు సమస్యను ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో 1వ వార్డులో ఉన్న ఇండ్లపై నుండి 11 కేవీ వైర్ల తీగను వ్యవసాయ మోటార్ల ట్రాన్స్ఫారంకు అనుసంధానం చేశారు.. దీంతో 11 కేవీ విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. గతంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి మూగజీవాలు( మేకలు) మృత్యువాత పడ్డాయి.. అదే సమయంలో సదరు మేకలు సాకుతున్న వ్యక్తి ఇంటికి విద్యుత్ సరఫరా అయింది.. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనే చర్చ గ్రామంలో జరిగింది.. ఇదే విషయంపై గత జనవరిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆరోజు ఇచ్చిన మాటను మర్చిపోకుండా మంగళవారం తురకగూడెంలోని ఇండ్లపై నుండి వెళ్ళిన 11 కేవీ తీగలను తొలగించాడానికి నిధులు మంజూరు చేయించి కొత్తగా విద్యుత్ లైన్లకు శ్రీకారం చుట్టారు.. ఇదే విషయంపై గ్రామస్తులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో కోక్యా నాయక్ , ఏఈ అశోక్ , లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , ఏల్ఏం సంగిశెట్టి గోపి , మల్లెబోయిన సురేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.





