Wednesday, March 11, 2026

మాతృ వృక్షం మరియు వసంత పంచమి వేడుకలు

నేటి సాక్షి – జగిత్యాల ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో శుక్రవారం*మాతృ వృక్షం మరియు వసంత పంచమి* వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించుకొని, ప్రతి జీవరాశిని గౌరవిస్తూ వాటిని కాపాడాలని తెలిపారు. వృక్షాలను సంరక్షించినట్లైతే బావి తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చునని తెలిపారు. మానవ మనుగడకు కారణమైన వృక్ష ,జంతు జాతులను సంరక్షిస్తూ ప్రకృతిని కాపాడాలని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న రావి చెట్టును మాతృ చెట్టుగా ప్రకటించారు. విద్యార్థులచే పుడమి తల్లి పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహేష్ అతిథిగా హాజరై మాట్లాడుతూ మొక్కలను విరివిగా నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం అధికారి ఆడెపు శ్రీనివాస్, గోవర్ధన్, సురేందర్ ,శ్రీనివాస్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News