నేటి సాక్షి :జిన్నారంమాదక ద్రవ్యాలకు ఎవరూ బానిసలు కాకూడదని ఐడిఎ బొల్లారం ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ 26ను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాలో భాగంగా బొల్లారంలోని శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో ఐడిఎ బొల్లారం ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాదక ద్రవ్యాల వాడకంవల్ల కలిగే దుష్పలితాల గురించి ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, అవగహనా కల్పించారు. విద్యార్ధి దశనుండే మత్తు పదార్థాల వినియోగం, వాటి దుష్పలితాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతియొక్కరి పై ఉందన్నారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మరియు సంగారెడ్డి జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్, ఆదేశాల మేరకు బొల్లారం ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్బంగా మాదక ద్రవ్యాలకు బానిసను కామని,మాదక ద్రవ్యాలకు బానిసలూ కాకుండా భాద్యతగల పౌరులుగా ఉంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. మొక్కలు నాటిన ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డిమాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల భాగంగా శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చెసిన ప్రతిజ్ఞ కార్యక్రమం సందర్బంగా పాఠశాల ఆవరణలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి మొక్కలు నాటారు.పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి భాద్యత అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బొల్లారం సబ్ ఇన్స్పెక్టర్ దశరథ, కిష్ట రెడ్డి,శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాల కరెస్పాండంట్ కొత్వాల్ హరికృష్ణ రెడ్డి,పోలీస్ సిబ్బంది , విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

