నేటి సాక్షి అనంతగిరి: మండల పరిధిలోని పాలవరం గ్రామంలో బుధవారం మండల మాదిగ జాగృతి ఆధ్వర్యం పాలవరం మాదిగ జాగృతి సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా మాదాసు బాబు, మదాసు వెంకటరత్నం, మాదిగ జాగృతి సంఘం అధ్యక్షుడిగా మదాసు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా మాదాసు నాగేంద్రబాబు, కార్యదర్శులుగా మాతంగి వినయ్ కుమార్ ,మాదాసు వీరబాబు,మదాసు మనోహర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా మాతంగి నరేష్, కలకొండ సైదులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ..ప్రతి ఊరికి ప్రతి గుండెకు ప్రతి గడపకు మాదిగ జాగృతి సంఘాలు ఉంటాయి అని,మన చరిత్రలు మన ఆచారాలు తెలుసుకొని మాదిగ జాగృతి సంఘం బలోపేతానికి కార్యకర్త కృషి చేస్తారని అన్నారు. సంఘానికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ..మాదిగ జాగృతి కి అహర్నిషులు కష్టపడతానని, మన సంఘం కట్టుబడులకు ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నం ఇర్మియా, కొత్తపల్లి ఉపేంద్ర,మాదాసు అంజయ్య,మాతంగి రాజు,వీరయ్య, రాములు, జిల్లేపల్లి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.





