Friday, March 20, 2026

*మానాలలో నువ్వా..? నేనా..? అనే పోటీ…!**- ఇప్పటినుండే జోరుగా ప్రచారం.. విందులు..**- స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి..**- ఒకవైపు యువతను మచ్చిక చేసుకునే యత్నం..*

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ఎవరికీ వారే వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఎన్నికల వాతావరణం ఊపందుకున్నది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొన్నది. రేపోమాపో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నరు. ఇప్పటికే గ్రామాల్లో బరిలో ఉండే వారి మద్దతుకోసం గ్రామంలో ముఖ్యమైన నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు పగలు, రాత్రి అని తేడా లేకుండా విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఉమ్మడి మానాలలోని కొన్ని తండాలో ఇప్పటికే ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకున్నారు. మానాల గ్రామంలో నువ్వా..? నేనా..? అనే పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఈసారి కచ్చితంగా గెలిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ప్రజలు సైతం సానుభూతి వ్యక్తం చేస్తూ గెలిపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఇక ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా అగ్రనేతలను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ నాయకుల మద్దతు కోసం ఆశావహులు ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీల గెలుపు కోసం విశేషంగా శ్రమించిన నాయకులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు.*- మద్దతు కోసం మందు పార్టీలు….*గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు తహతహలాడుతున్న సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. యువకులు, యువజన, కుల సంఘాల సభ్యులను ప్రలోభ పరిచేందుకు మందు పార్టీలను ఎర వేస్తున్నారు. మద్యం ప్రియులు సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిత్యం ముక్క, సుక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది…*- పెరుగుతున్న పోటీ..*గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆశావహులు నిన్నటి నుంచే తామంటే తాము బరిలో నిలుస్తున్నామంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత ఖర్చయినా భరిస్తూ పోటీలో నిలిచి గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిన అభ్యర్థులు సైతం ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతామని ప్రణాళికలను సైతం రూపొందించుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు మాటామంతీ కలుపుతున్నారు. ఈసారైనా గెలిపించాలంటూ వేడుకుంటున్నారు…*- ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు..*అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జక్కుల లక్ష్మీ నర్సయ్య, తూమ్ రవీందర్, బుర్ర శంకర్ లు ఎవరికి వారే వారి పనుల్లో నిమగ్నమయ్యారు. బిఆర్ యస్ పార్టీ నుంచి మాజీ వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం లు ఉండే అవకాశం ఉంది… ఇక బీజేపీ నుంచి ఎవరు అనేది ఇప్పటి తేలలేదు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News