గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపైనే అగచాట్లు పడుతుంటే ప్రభుత్వ చర్యలు ఎక్కడ?**వ్యవసాయ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చి ఎనిమిది రూపాయలు కొనుగోలు చేయాలన్న ఎక్కడ అమలు కానీ వైనం**రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మేలు చేయకపోతే ఉద్యమాలు చేపడతాం* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి* నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) *గంగాధర నెల్లూరు:*మామిడి రైతుల ఆవేదన, బాధలు రోజురోజుకు తీవ్రతరమైపోతున్నాయి, మామిడి రైతుల కన్నీళ్లు కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మీ మండిపడ్డారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో రైతులు రాష్ట్ర కష్టాలు పడుతున్నారని, సంవత్సరం కాలం పాటు కష్టం శ్రమించి అప్పుచేసి పెట్టుబడి పెట్టి మామిడి పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసేవారు లేక అన్నదాత కన్నీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిట్ ప్లస్ ఫోర్ పేరుకే చెప్పిన ఎక్కడ అమలు కాలేదని మండిపడ్డారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల కేంద్రంలో జైన్ గుజ్జు పరిశ్రమ వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల మేర రైతులు మామిడికాయలతో ట్రాక్టర్లలో నాలుగు రోజులుగా వేచి చూస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వాలు కనీస స్పందన లేదు. తిండి నీరు లేక రోడ్లపై ఇబ్బందులు పడుతున్న రైతు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పూర్తి మామిడి పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.