Tuesday, January 20, 2026

*మారిన రిజర్వేషన్లు పక్క వార్డుల్లోకి పరుగులు*- *అయోమయంలో ఆశావహులు**మంచిర్యాల జిల్లా,

నేటి సాక్షి జనవరి 20*మంచిర్యాల జిల్లా చెన్నూర్ పురపాలక సంఘాలకు సంబందించిన ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది నామినేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది అనుకున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు వెలువడ్డాయి. అందులో భాగంగా చెన్నూర్ మున్సిపల్ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చింది. చెన్నూర్ మున్సిపాలిటీ లో 18 వార్డులో రిజర్వేషన్లు ప్రకటించారు ఒక్కసారిగా చెన్నూర్ లో రిజర్వేషన్ ప్రటకనతో ఇన్ని రోజులుగా ఆ వార్డులో పోటీ చేస్తామని ప్రచారంచేస్తున్న ఆశవాహుల ఆశలు ఒక్కసారిగా ఆవిరి అయిపోయాయి,*అంచనాలు తలకిందులు*చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో రిజర్వేషన్ల కేటాయింపుతో అంతా తలకిందులుగా మారినట్లయింది. గత 3.4 సంవత్సరాలు గా ఆశలు పెట్టుకున్న నాయకులకు కలిసిరానట్లయింది. తమకే రిజర్వేషన్ వస్తుందనుకొని ధీమాగా ఉన్న రాజకీయ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రిజర్వేషన్లు ఒకసాదిగా తలకిందులు కావడంతో ఆయా వార్డుల్లో పోటీ చేద్దామని భావించిన నాయకుల్లో అయోమయం నెలకొంది తమ రాజకీయ భవితవ్యం ఎలా అనేది సందిగ్ధంలో పడ్డారు*పక్క వార్డులకు పరుగో పరుగు*చెన్నూర్ మున్సిపల్ వార్డు పోటీలో ఉన్నామని భావనతో ఉన్నప్పటికీ అటువంటి వార్డులోనూ పూర్తి భిన్నంగా రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో తమ వార్డు కాకుండా పక్క వార్డులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పరుగులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు, ఈ సారి ఎలాగైనా గెలవాలని అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో పక్క వార్డుల్లో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు,పోటీలో నిల్చునే కౌన్సిలర్లకు అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే వారి వ్యక్తిగత బలాలు, మారిన రాజకీయ రిజర్వేషన్ల వల్ల ఆయా పార్టీలు ఎటువంటి వ్యూహం తో ముందు కు వెళ్తాయో చూడాలి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News