నేటి సాక్షి గజ్వేల్… రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, వాటిలోనే రైతులు పండించిన పంటలు విక్రయించాలని డిసిఓ వరలక్ష్మి స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రంలో విక్రయించి ఆర్థికంగా ప్రయోజనం పొందాలని సూచించారు. క్వింటాలుకు రూ 8000 చెల్లిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టార్ రగోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ, ప్యాక్స్ సీఈవో బాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.





