Tuesday, January 20, 2026

మార్చి చివరి వరకు కేసి కి నీటిని విడుదల చేయాలి.. సమాచారం లేకుండా అర్ధాంతరంగా నీళ్లు బంద్ చేయడం తగదు:–సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం. రమేష్ బాబు

నేటి సాక్షి 20 జనవరి జూపాడుబంగ్లా :–నందికొట్కూరు నియోజకవర్గం లో అత్యధికంగా కేసి కెనాల్ ఆయకట్టు రైతులు ఉన్నారని, కేసీ కెనాల్ అధికారులు కాలువ కు అర్ధాంతరంగా రైతులకు సమాచారం ఇవ్వకుండా నీరు బంద్ చేయడం ఏంటని మార్చి చివరి వరకు సాగునీరు విడుదల చేయాలని లేని పక్షంలో రైతుల పంట పొలాలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉందని ఇప్పటికే ఎండు కారు వరి పంట కేసీ కెనాల్ కింద వందల ఎకరాలు సాగు చేశారని నార నాటు సమయం లో ఇప్పుడు కనీసం కాలువల్లో నీళ్లు కూడా ప్రవహించే పరిస్థితి లేదని తక్షణమే సాగునీరు విడుదల చేయాలని లేని పక్షంలో కేసి రైతుల ఆందోళన తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.. రమేష్ బాబు హెచ్చరించారు..మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సిపిఐ నాయకులతో కలిసి వారు మాట్లాడారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో కేసి కెనాల్ ఆయకట్టు రైతులు అత్యధికంగా పంటలు సాగు చేశారని ఇప్పటికే వరినారు వేపుగా పెరిగిందని ఎండకారు వరి నాటు చేసే సమయంలో అధికారులు రైతులకు సమాచారం ఇవ్వకుండా పేపర్ ప్రకటనలు తెలియజేయకుండా అర్ధాంతరంగా సాగునీరు బంద్ చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ప్రతి సంవత్సరం మార్చి చివరి వరకు నీళ్లు విడుదల చేయాలని వారు కోరారు.. కేసీ కెనాల్ అధికారులు తప్పిదాలు చేస్తున్నారని రెండు పంటల సాగుకు రైతులకు పుష్కలంగా పక్కనే కృష్ణా నది నీళ్లు ఉన్న నీరు బంద్ అయ్యేంతవరకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.. ఇప్పటికే రైతులు కాలువల వెంబడి రాత్రింబగళ్ళు నీటి కోసం ఎదురుచూస్తున్నారని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు సాగునీరు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కేసీ కెనాల్ ఆయకట్టు కు మార్చి చివరి వరకు మీరు ఉండేలా చూడాలని వారు కోరారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు మాగబుల్ బాషా, సలీం, పుల్లయ్య,రమణ, సలాం నారాయణ రఫీ దేవదాసు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News