Saturday, March 7, 2026

*మార్పు కోరుకుంటున్న కోరుట్ల ప్రజలు** బీజేపీ నేతల ఘాటు వ్యాఖ్యలు* ఇస్తా రెస్టారెంట్‌లో విలేకరుల సమావేశం* మున్సిపల్ ఎన్నికల్లో కమలం జెండా ఎగరేయాలని పిలుపు——*నేటి సాక్షి

– కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని ఇస్తా రెస్టారెంట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత్యాల జిల్లా బీజేపీ ప్రభారీ గడ్డం శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా పేరు మారినా పాలనలో ఎలాంటి మార్పు లేదని, “బంగారు తెలంగాణ” అని చెప్పి ప్రజలను కాపలా కుక్కలా ఉపయోగించుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా ప్రచారం చేసినా, వాస్తవంగా లబ్ధి ఎవరికీ దక్కలేదని, ముఖ్యంగా పంపకాల విషయంలో తీవ్రమైన తేడాలు ఉన్నాయని ఆరోపించారు.*మార్పు కోసం బీజేపీ పిలుపు*కాంగ్రెస్ పార్టీపై కూడా గడ్డం శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కమిషన్, బుజ్జగింపు రాజకీయాలు, లంకె బిందెలు, వీధి రౌడీ భాష, ఢిల్లీకి డబ్బుల పంపకాలు మాత్రమేనని ఆరోపించారు. దీనికి భిన్నంగా బీజేపీ “సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అనే నినాదంతో దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. కోరుట్ల మున్సిపల్ ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. *అర్వింద్ సభలకు సన్నాహాలు*కోరుట్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 8 న ఆదివారం రోజున నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కోరుట్లలో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు నేతలు తెలిపారు. జాన్సీ రోడ్ మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగే ఈ సభల్లో కోరుట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి మున్సిపల్‌పై కమలం జెండా ఎగరేయాలని ఆయన విన్నవించనున్నారు. గెలిచిన కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించి చైర్మన్ అభ్యర్థిని ఎంపీ అర్వింద్ ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.*అభివృద్ధే బీజేపీ లక్ష్యం*మున్సిపల్ అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ ప్రభుత్వం అమృత్ పథకం కింద కోరుట్ల మున్సిపాలిటీకి ఇప్పటికే రూ.18 కోట్ల 60 లక్షలు మంజూరు చేసిందని బీజేపీ నేతలు గుర్తు చేశారు. మున్సిపల్ బీజేపీ పార్టీ కైవసం అయిన తర్వాత కోరుట్ల అభివృద్ధికి మరిన్ని భారీ నిధులు తీసుకురావడంలో ఎంపీ అర్వింద్ కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే భారీ బహిరంగ సభలను విజయవంతం చేయాలని, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ ప్రభారీ ఆలపాటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల ప్రముఖ వైద్యుడు డా. అనూప్ రావు పాల్గొన్నారు.——

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News