చెన్నూర్ లో నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని మరియురాజస్థాన్, గుజరాతి మార్వాడిలు స్థానికంగా తీసుకున్న బీసీ సర్టిఫికట్లు రద్దు చేయాలనిమాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుందని రేగుంట సునీల్ అన్నారు,అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న బీసీ ఉద్యమ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ పై బెదిరింపులు చేస్తున్న చెన్నూర్ లో స్థిరపడ్డ రాజస్థాని మార్వాడి వర్గానికి చెందిన శ్యామసుందర్ దేవడా ను వెంటనే అరెస్ట్ చేయాలనీ, ఇచ్చిన బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు వెంటనే రద్దు చేయాలనీ మాదిగ హక్కుల దండోరా తరపున డిమాండ్ చేస్తున్నామన్నారుఅక్రమంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందాలని చూస్తున్న మార్వాడిల కుట్రను పసిగట్టి దానికి అడ్డుకట్ట వేసినందుకు రమేశ్ యాదవ్ మీద దాడికి పాల్పడాలనే కుట్రతో అయన ఇంటి చుట్టూ చెక్కర్లు కొట్టడం, ఫోన్ లో బెదిరింపులకు పాల్పడడం చాలా పట్ల రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖడిస్తుంది. బెదిరింపులకు పాల్పడిన శ్యామ్ సుందర్ దేవుడా ని వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.ఎక్కడినుండో వ్యాపారాల కొరకు వచ్చిన మార్వాడీలు స్థానిక బీసీ సర్టిఫికెట్స్ పొంది ఇక్కడి బీసీ బిడ్డల అవకాశాలు కోళ్లగొట్టాలి అనుకోవడం దుర్మార్గం. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. ఇది వరకే మార్వాడిలకు బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలిఅందుకు సహకరించిన అధికార్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సిద్ది రమేష్ యాదవ్ కీ మాదిగ సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాము అన్నారు,





