(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 19:)*రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు మరియు ఇళ్ల స్థలాల మంజూరు చేయాలనీ టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా ల నెత్రుత్వంలో బుధవారం మణికొండ లో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లకు విన్నపించారు.రంగారెడ్డి జిల్లా పరిధిలో వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో పని చేస్తున్న జర్నలిస్టులు సామాజిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితులు వంటి అంశాలను ఎల్లప్పుడూ ముందుండి ప్రజలకు చేరవేస్తున్నారు. ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధి పాత్రను భాద్యతగా నిర్వహిస్తున్నారు. అయితే, జిల్లా అంతట పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు హెల్త్ కార్డులు (హెల్త్ కార్డ్స్), ప్రభుత్వ గుర్తింపు కార్డులు (అక్క్రిడిటేషన్ కార్డ్స్) నూతనంగా రాకపోవటంతో మరియు ఇళ్ల స్థలాలు/హౌసింగ్ ప్లాట్లు వంటి మౌలిక ప్రయోజనాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి వివరించారు.జిల్లాలో ఇప్పటికే పలువురు జర్నలిస్ట్ లు సరైన వైద్య సదుపాయాలు అందకా ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్త్ కార్డులతో పాటు, భీమా సౌకర్యం కల్పించాలని కోరారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత వహిస్తున్న జర్నలిస్టులు కూడా సామాజిక భద్రత, వైద్య సౌకర్యాలు మరియు స్థిరమైన నివాసం వంటి మౌలిక సదుపాయాలు పొందాల్సిన అవసరం చాలాకాలంగా ఉందని ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారిoచాలని కోరారు.హెల్త్ కార్డ్ పని చేయక పోవడం వలన రిపోర్టర్స్ ఇబ్బంది పడుతున్నారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ వి 6 రిపోర్టర్ నర్సింగ్ రావు గుండె పోటుకు గురై స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,తక్షణం ఆదుకోవాలని కోరారు.అదేవిదంగా ఉద్యోగుల మాదిరిగా అందరికీ హెల్త్ కార్డ్ అమలు అయ్యేలా చూడాలని విన్నపించారు.ఇటీవలే షాబాద్ మండలానికి చెందిన రిపోర్టర్ రాములు గుండె పోటుతో మృతి చెందారు.వారి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు.వీటిపై మంత్రి సా నుకూలంగా స్పందించారు.మంత్రిని కలిసిన వారిలో జిల్లా దాడుల నివారణ కమిటీ సభ్యులు భీమయ్య, సీనియర్ నేతలు సూర్యనారాయణ, రాజేందర్ రెడ్డి, రాజు, విష్ణు ల, రాము, శేఖర్ రెడ్డి,నరేందర్,బాలు, లక్ష్మినారాయణ,ఎం విజయ్, తదితరులు ఉన్నారు.





