నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్టంలో బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ జేఏసీల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ దీక్ష కు మద్దతుగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన నిర్వహించి, సామాజిక న్యాయం చేయాలని స్థానిక సంస్థల్లో బీసీ లకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రత్యేక జీవో ఏర్పాటు చేసినా కూడా, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా, తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, బిసి సంఘం నాయకులు జాజుల లింగం గౌడ్, మహేష్, బిసి సంఘం నేతలు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.





