పివి పురం ప్రజలు బిడ్డలకు చదువు దూరం చేయ వద్దు నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)చంద్రగిరి నియోజకవర్గం లోని రామచంద్రపురం మండలం వుండే ప్రసన్న వెంకటేశ్వరపురం, పరమాల గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను3,4,5 తరగతులను ఆదర్శ పాఠశాల పేరుతో విలీనం చేసే ఆలోచన విరమించుకోవాలని ఈరోజు పివి పురం సిఐటియు ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో అభిప్రాయాలు తెలుసుకొని నినదించడం జరిగింది.సమర్పించిన వారిని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వందవాసి నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే సుమన్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల రాష్ట్ర కోకన్వీనర్ అశోక్ కుమార్ ఎస్ఎఫ్ఐ నగరకార్యదర్శి తేజ తదితరులు కలిసి గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించి అక్కడ ప్రజలతోనూ మరియు విద్యార్థులతోనూ మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మా బడి మాకే కావాలి మాకు న్యాయం జరగాలి గ్రామస్తులు నినాదాలు ఇవ్వడం జరిగింది.ఆర్ సి పురం మండలంలో పివిపురంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో బలిజిపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో విలీనం చేశారు.దీంతో ప్రక్కన ఉన్న రామిరెడ్డిపల్లి, ఎస్టీ కాలనీ గంగమాంబ పురం, అరుంధతి వాడ పివిపురం గ్రామాల నుంచి విద్యార్థులు రాష్ట్ర రహదారిపై నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు ఆ గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే తీవ్రమైన ఇబ్బందులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఊరు నుంచి బలిజిపల్లికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదవశాస్తూ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అవకాశం ఉంది. ప్రస్తుతం పి. వి పురం పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా బలిజిపల్లి లో ఉండే పాఠశాలలో 22 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ చర్చించకుండా గ్రామ కమిటీలు తీర్మానం చేయకుండా మండల పరిషత్ లో తీర్మానం చేయకుండా ఆ స్కూల్ ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు? పి వి వి పురం నుంచి స్కూలు మారిస్తే ఎక్కువ మంది విద్యార్థులు స్కూలుకు దూరం కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం…అదేవిధంగా పివిపురంలో ఉండే మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ఆ పాఠశాల స్థలం మూడున్నర ఎకరా ఉంది. కాబట్టి పివీ పురం లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ రాందాస్ రెడ్డి మల్లిరెడ్డి తదితరుల గ్రామస్తులు పాల్గొన్నారు.