Tuesday, March 17, 2026

మా స్వప్నం గ్రామీణ సౌభాగ్యం డి సి సి బి మంబోజిపల్లి బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ రాజు మెదక్ జిల్లా కొల్చారం

నేటి సాక్షి ( భూమయ్య ) వరిగుంతం గ్రామంలోసహకార కేంద్ర బ్యాంక్ మా స్వప్నం గ్రామీణ సౌభాగ్యం ప్రజల అవసరాలకు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నుండి వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు, చిన్న తరహా వ్యాపార రుణాలు, గ్రామీణ ప్రాంతాలలో గృహ రుణాలు, వాహన రుణాలు, మహిళా సంఘాలకు రుణాలు మా బ్యాంకు ద్వారా అందించే రుణాలు అని కేడిసిసిబి మంబోజిపల్లి బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ రాజు తెలిపారు. మంగళవారం కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో డిపాజిట్ల సేకరణ మా సోత్సవం కార్యక్రమం నిర్వహించారు.స్వర్ణ నిధి డిపాజిట్ 444 రోజుల ఫిక్సడ్ డిపాజిట్ పై అధిక వడ్డీ పొందవచ్చు అని ఆయన తెలిపారు. బంగారంపై అత్యధికంగా గ్రాముకి 7,400 రుణము అని తెలిపారు. లాకర్ సౌకర్యం కూడా ఉన్నది. మీ అన్ని ఆర్థిక అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని డిసిసిబి ఫీల్డ్ ఆఫీసర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి స్టాఫ్ అసిస్టెంట్ ఆస్మా, సొసైటీ చైర్మన్ చిన్నారావు ప్రభాకర్, మాజీ చైర్మన్ అచ్చన్న పల్లి నర్సింలు, ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, ముత్యం గారి సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ అక్కం గారి శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News