నేటి సాక్షి : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ ను మంజూరు చేయాలని కోరుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి గ్రామ సర్పంచ్ చింతల నారాయణ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతల నారాయణ మాట్లాడుతూ మా గ్రామంలో 2014- 2019 సంవత్సరంలో మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, కానీ ఆ ప్లాంట్ కొద్ది కాలంలోనే మరమ్మతులకు గురైందని, నేను మరమ్మతులకు ప్రయత్నించిన ఫలితం లేకపోయిందని, టెక్నీకల్ ప్రాబ్లమ్ ఉందన్నారు. కావున మా ఊరు మీద దయ ఉంచి కొత్త వాటర్ ప్లాంట్ మంజూరు చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. ప్లాంట్ కు కావాల్సిన గది, నీరు అందుబాటులో ఉన్నాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి గ్రామ సర్పంచ్ చింతల.నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో. యువ నాయకుడు టిడిపి యువ నాయకుడు చింతల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.





