Wednesday, February 11, 2026

మిట్టకందాల లో సిఎస్ఐ నూతన చర్చి ప్రారంభము నూతన ఆలయంలో నీమనసు నీదేవుడు ( యేసుక్రీస్తు) తో నిబంధన చేసుకో.. బిషప్.. సంతోష్ ప్రసన్న రావు….

నేటి సాక్షి 11ఫిబ్రవరి పాములపాడు :- పాములపాడు మండలము మిట్టకందాల గ్రామంలో సీఎస్ ఐ సంఘము పాస్టేట్.ఛైర్మెన్ ఎం.మోహన్ రాజ్ గాంధీ ఆధ్వర్యంలో నూతన చర్చి ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి డీనరీ చైర్మన్ ఎస్ సంజయ్ మధు ఆధ్వర్యంలో ప్రార్ధనలు చాలా గొప్పగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్న రావు బిషప్ సతీమణి పాస్టర్ అమ్మ బ్యూల సంతోష్ అమ్మ గారు మరియు వేల్పుల ఆనంద్ కుమార్ IRS రావడం జరిగింది.మలేరియా ఆఫీసర్ చంద్రశేఖర్ వారు రావడం జరిగింది.బిషప్ సంతోష్ ప్రసన్న గారు మాట్లాడుతూ మనము ఈ నూతన సంవత్సరం లో నూతన ఆలయంలో మనము మన మనసు నీ, దేవుని కి యేసుక్రీస్తు కి నిబంధన చేసుకోవాలి.మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకుంటే, యెహోవా, మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు.దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజు ప్రార్థించాలి. అంతేకాకుండా ఈ సంవత్సరం2026 అయినా నువ్వు వెళ్లే మార్గం గుర్తు పట్టు, గొర్రె, చర్మం వేసుకొని వస్తారు ఏమి చెప్పిన చేసావ్. ఈ రోజు నుంచి మనుషులు నమ్ముట కంటే, యెహోవా నాశ్రయించుడి వాగ్దానం జరగకుండా ఎన్నో ఆటంకాలు శ్రమలు బాధలు నిందలు అవమానాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. దావీదు కూడా చాలా ఆటంకాలు కు వచ్చాయి . కావున ఎవరిదానం నాది దాటాలి అంటే, ఆరోజు ఇజ్రాయేలు దేవుని ఎదుట ప్రమాణం చేశారు. అలా ప్రమాణం చేశారు కాబట్టి. ఈరోజు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నిబంధన మందసము, నిబంధన మందసము అంటే, కరుణ,పీఠము నిబంధన మందసము సాక్ష్యపు గుడారము దేవుని శరీర రక్తము దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని ఎప్పుడు మన మదిలో నింపుకోవాలి. అప్పుడే మన నూతన ఆలయంలో సంవత్సరములు అద్భుతాలు జరుగుతాయి. ఈ సంవత్సరంలోనైనా, మనము మన క్రియలను బట్టి మన అతిక్రమములను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ నూతన హృదయంతో మన మనసుని దేవుడు కి ఇవ్వాలి..సంవత్సరములో, ఎవడైనను, క్రీస్తు నందున్న యెడల, వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో ఈ సమస్తము కొత్త ఆయును. కావున అందరూ నిత్య రాజ్యములోకి ప్రవేశించాలని,దేవుని సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, అంతేకాకుండా, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మంచి మనసుతో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని ప్రజలు దినదిన అభివృద్ధి చెందాలని నూతన ఆలయంలో సంవత్సరం అంటే నూతనంగా నీ మనసును మార్చుకొని మంచి పనులకు పేదవారికి సహాయం చేసే గుణం ఉండాలని అన్నారు. అంతేకాకుండా అతి తక్కువ సమయంలో ఈ మిట్టకందాల గ్రామంలో చర్చి ప్రారంభోత్సవము చెందటానికి కారణం దేవుని శక్తి దేవుని కృప మహిమ ఉంటుంది .అందుకనే మంచి మార్గంలో నడవాలి. నిజమైన . బిషప్ సందేశం ఇస్తూ కొత్త సంవత్సరములో, కొత్త ఆలయంలో ప్రతి ఒక్కరూ నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వాలని సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ దైవ సన్నిధానంలో గడపాలని తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేమ ఈ ఆలయంలో ఎప్పుడూ ప్రార్థనలు దేవుడికి ప్రార్థనలు జరుపుకోవడానికి మీకు దేవుడు ఇచ్చిన కృప మీరందరూ దేవుడు సన్నిధానంలో నడవాలని చెడు మార్గం ఒదిలి పరలోక రాజ్యానికి మనమందరం వారసులం కావాలని మిట్టకందాల చర్చి మండల ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్య రాజు రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. సంఘ పెద్దలు విశ్వాసులు యవనస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విచ్చేసిన విశ్వాసులు వేల్పుల ఆనంద్ కుమార్ సార్ వెంట వచ్చిన విశ్వాసులు కలబండి.అంకన్న.గట్టు.శంకర్ గౌడ్..డక్క.శ్రీకాంత్ రవి, నాగేంద్ర, శంకర్ గౌడ్ రుద్రవరం, మేకల సుధాకర్, వినోద్, రత్నం, బలరాం , శివపురం బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, దినేష్,వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజనము 2000మందికి పెట్టడం జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News