Wednesday, March 11, 2026

మిరప పంట పొలాలు పరిశీలన-రైతులు యూరియా యాప్ లో పండించే పంటనే నమోదు చేయాలి-రైతులందరు ఫార్మర్ రిజిస్టేషన్ చేసుకోవాలి-వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్ర మణి

నేటిసాక్షి, మిర్యాలగూడ (జనవరి 24) : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం లోని నరసాపురం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి యం. ఋషేంద్ర మణి మిరప పంట పొలాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మిరప పంటలో మిరపపై ముడత, కింది బాగంగలో ముడత, మరియు బూడిద తెగులు ఉండటం గమనించి, నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మిరప పంట వేసిన రైతులు, యూరియా బుకింగ్ యాప్ లో మిరప తోటగానే నమోదు చేయాలని, అధిక యూరియా కోసం వరి రైతులు మిరప పంటగా నమోదు చేయకూడదని తెలియజేశారు. అలాగే దామరచర్ల మండలంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిణి పార్వతి, మరియు సర్పంచ్ హతీయ, రైతులు సేవ, సైదా, లక్ష్మణ్, శివ, హట్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News