Friday, March 6, 2026

మిర్యాలగూడ “పుర” పీఠం ఎవ్వరికీ దక్కేను-మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీలు-ఓటరు నాడి అర్ధం కావట్లేదని విశ్లేషకుల అభిప్రాయం-మొత్తం 48వార్డుల్లో జరగనున్న ఎన్నికలు-కీలకం కానున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు-గెలుపుపై ఎవ్వరి లెక్కలు వారివే-ఓటరు ఏవైపో మరి చూడాలి….-ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ ఉన్నత అధికారులు

నేటిసాక్షి, మిర్యాలగూడ : రాష్ట్రంలో జరుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలు రోజు రోజు హీట్ ను పెంచుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న ఈ “పుర పీఠం” దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో ఇప్పటి వరకు దూసుకుపోయారు. ఈ నెల 11న (రేపు) మున్సిపల్ జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారో అనే ఆతృత నాయకుల్లోనే కాదు, ప్రజాల్లోనూ మిర్యాలగూడ స్థానం పైనే ఉంది. ఈ మిర్యాలగూడ పట్టణం దేశంలోనే రైస్ ఎగుమతుల్లో ముందున్నది. పట్టణంలో మొత్తం 48 వార్డులు ఉండగా ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, ఇతర స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ కాలనీల్లో పోటీకి తాము కూడా సై అంటూ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలో ఎలాగైనా చైర్మన్ తమ పార్టీకే దక్కాలని ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ ఇతర నాయకులు సైతం తమ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రేషన్ కార్డుల జారీ, ఇలా తమ పార్టీ అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి పూర్తిస్థాయిలో వివరించి తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ భాగంలోనే స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తోనే భారీ సభను మిర్యాలగూడలో నిర్వహించారు. సభ విజయవంతం కావడంతో ఆ జోష్ తో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రభుత్వం అందజేస్తున్న అనేక సంక్షేమ పథకకాలు, తాము అధికారంలోకి వొచ్చాకా పట్టణంలో చేసిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారితో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మొత్తం 48 వార్డుల్లో గులాబీ జెండా అభ్యర్థులు విజయకేతనం కోసం తనయుడు సిద్ధార్థ, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహ రెడ్డి, జూలకంటి రంగన్న తో కలిసి అన్ని వార్డుల్లో భారీ సంఖ్యలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వార్డుల్లో గులాబి జెండా బలపర్చిన అభ్యర్థులు సైతం గెలుపొందూతారని ధీమాగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు నమ్మలేని పరిస్థితులు ఉన్నాయని, 10సం. లల్లో పట్టణాన్ని తాము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ పార్టీ బాకీల కార్డుతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఏదీ ఏమైనా మిర్యాలగూడ పట్టణంలో ఏ పార్టీ గెలుస్తుందో…చైర్మన్ ఎవ్వరు అవుతారో అని అందరి చూపు ఇటు వైపే ఉంది. ఈ ఎన్నికల్లో మాత్రం పట్టణంలో ప్రచారంలో బిజెపి అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్ధులు తమ ఒక్క అవకాశం ఇవ్వాలని అభివృద్ధి చేస్తామని ఓట్లరను కోరారు. తప్పకుండా తాము విజయం సాధించి, చైర్మన్ ను ఎన్నుకునే క్రమంలో తాము కీలకం అవుతామని అంటున్నారు. అన్ని వార్డుల్లో అన్ని పార్టీలో మాత్రం ప్రచారంలో విపరీతంగా పాల్గొనటం, కొన్ని వార్డుల్లో ప్రజలు సైలెంట్ గా ఉంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇలా సైలెంట్ గా కొన్ని వార్డులు ఏవైపు గెలుపు ఉంటుందో అని ఈ వార్డుల్లో గెలుపు ఓటమిలు అధికారాన్ని తారుమారు చేస్తాయని ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు తమకు నచ్చిన వ్యక్తి ఓటు వేసుకునేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News