నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 1 నుండి 48 వార్డులకు రిజర్వేషన్ల వివరాలు శనివారం వెల్లడించారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా జనరల్ మహిళ కు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారు చేసినట్లు సమాచారం. వార్డుల వారిగా రిజర్వేషన్లు.1 వార్డ్ బీసీ మహిళ..2 వార్డ్ జనరల్ మహిళ.3 వార్డు జనరల్ మహిళ..4వార్డు జనరల్..5 వార్డు ఎస్టీ మహిళ6 వార్డు ఎస్టీ జనరల్..7 వార్డు జనరల్ మహిళ..8 వార్డు జనరల్ .. 9 వార్డు ఎస్సీ జనరల్..10 వార్డు బీసీ మహిళ..11 వార్డు ఎస్సీ జనరల్..12 వార్డు జనరల్ మహిళ13 వార్డు జనరల్ ..14 వార్డు జనరల్..15 వార్డు ఎస్సీ మహిళ..16 వార్డు ఎస్సీ మహిళ.. 17) జనరల్ మహిళ 18 వార్డు ఎస్సీ జనరల్..19 వార్డు బీసీ జనరల్..20 వార్డు జనరల్ మహిళ.. 21 వార్డు బీసీ మహిళ..22 వార్డు బీసీ జనరల్..23 వార్డు బీసీ జనరల్..24 వార్డు బీసీ మహిళ..25 వార్డ్ ఎస్టి జనరల్..26 వార్డ్ బీసీ జనరల్.. 27 వార్డు జనరల్ మహిళ..28 వార్డు జనరల్..29 వార్డు జనరల్..30 వార్డు బీసీ మహిళ..31 వార్డు బీసీ మహిళ..32 వార్డు జనరల్..33 వార్డు జనరల్ మహిళ..34 వార్డు జనరల్ మహిళ..35 వార్డు జనరల్..36 వార్డు బీసీ మహిళ..37 వార్డ్ బీసీ జనరల్..38 వార్డు జనరల్ మహిళ..39 వార్డు జనరల్.. 40 వార్డు జనరల్..41వార్డు జనరల్ మహిళ..42 వార్డు బీసీ మహిళ..43 వార్డు జనరల్ మహిళ..44 వార్డ్ జనరల్..45 వార్డు బీసీ జనరల్..46 వార్డు బీసీ జనరల్..47 వార్డు బీసీ జనరల్..48 వార్డ్ జనరల్ మహిళ. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, వివిధ పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్ధులు సైతం ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ మున్సిపల్ పీఠం మరి ఎవ్వరికీ చేరుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

