నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 21,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని నారాయణపేట కు వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ ముందు ప్రభుత్వ మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కావడంతో తాగునీరు రోడ్లపై ప్రవహిస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలను సరిచేయాలని మరికల్ గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

