—– మాది అద్భుతాల బీఆర్ఎస్….కెసిఆర్ ను తిట్టే అర్హత మీకు లేదు..
—– తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క..
—– బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు , జాగృతి నేత
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలులావణ్య జగన్ మాట్లాడుతూ… అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మీది.. అధికారంలో ఉన్న పదేళ్లలో అద్భుతాలు సృష్టించిన చరిత్ర కేసీఆర్ ది.. మీరా మా గురించి మాట్లాడేది.. మరోసారి మా కెసిఆర్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు.. అంటూ మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడే నైతిక హక్కు లేదని టిఆర్ఎస్ పార్టీ మహేశ్వరం మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె స్పందిస్తూ కెసిఆర్ బీసీలకు చేయలేదు అంటున్న నాయకులు కేసీఆర్ కిట్లు బీలకు వర్తించలేదా, కళ్యాణ లక్ష్మి చెక్కులు బీసీలకు రాలేదా.. రైతుబంధు పడలేదా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లలు పుడితే 12 వేల చొప్పున ఇచ్చిన మొత్తం బీసీలకు అందలేదా చెప్పాలన్నారు. కెసిఆర్ బీసీలకు 62 శాతం రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే వారికి 50 శాతం కంటే ఎక్కువ అవసరం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళలకు, ఒంటరి మహిళలకు అత్యధిక పెన్షన్లు కెసిఆర్ హయాంలోనే వచ్చాయని, కెసిఆర్ పథకాలు అన్నిటిని కాపీ కొట్టి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులవి నోరు తెరిస్తే అబద్దాలేన ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు బీసీల రిజర్వేషన్లు అడ్డుకొని ఇప్పుడు 42 శాతం ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు లావణ్య జగన్ కవితపై మాట్లాడే నైతిక హక్కు లేదు తెలంగాణ ముద్దుబిడ్డ కవితపై మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు..