(నేటి సాక్షి విలేకరి) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామంలో సర్పంచ్ పోటీలో పాల్గొన్న అటువంటి అభ్యర్థి గాలి పెల్లి భారతి మహేష్ నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వం నుండి మన గ్రామ పలు అభివృద్ధి కొరకు పాటుపడతానంటూ తెలిపారు. గత ప్రభుత్వంలో ఎంపిటిసిగా ఉన్నటువంటి మా భర్త మహేష్ ఉన్న సమయములో 25 లక్షలు ఫండ్స్ తో ఐదు చోట్ల సిసి రోడ్లు 10 లక్షల ఫండ్స్ తో రెండు చోట్ల డ్రైనేజీలు నిరుపేద కుటుంబాలకు పెళ్లిళ్ల ఆర్థిక సహాయాలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పథకాలు 23 లక్షలతో సంఘ భవనాలు పద్మశాలి మరియు కాపు సంఘ భవనం అంగన్వాడి భవనం,ఒక కోటి రూపాయలతో స్కూల్ నిర్మాణ స్థలం కొనుగోలు పేదవారికి ఆర్థిక సహాయాలు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మన మద్దునూర్ గ్రామం ప్రజలకు చేయడం జరిగింది. కాబట్టి మమ్మల్ని గుర్తించి నన్ను సర్పంచుగా గెలిపిస్తేఇలాంటి మరెన్నో పథకాల్లో ముందుకెళ్లి చేపిస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు.





