నేటి సాక్షి,నల్లబెల్లి, జనవరి 7 :విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని బుచ్చిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ భూక్య భద్రమ్మ సూచించారు.MPPS బుచ్చిరెడ్డిపల్లి పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ హాజరై విద్యార్థులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్‌కు పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా సన్మానం చేశారు.సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని సూచించారు.పిల్లల ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం పాఠశాలలో పండుగ వాతావరణాన్ని సృష్టించి అందరిలో ఉత్సాహాన్ని నింపింది.

