నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 10, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని మంత్రం పల్లి గ్రామంలో గల ఊర చెరువు మరమత్తు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఊర చెరువులో అలుగు కంప తొలగించే మరమ్మతులు పనుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రం పల్లి గ్రామస్తులు వివరించారు. ఇట్టి పనులు మంజూరైన అధికారులు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప పనులు ముందుకు సాగడం లేదని మంత్రం పల్లి గ్రామస్తులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఊర చెరువు మరమ్మత్తుల పనులకు కోసం మిషన్ కాకతీయ పనుల కింద దాదాపు 10 లక్షలు మంజూరైన అధికారులు పనులు చేపట్టకపోవడంతో అట్టి నిధులు అట్టి నిధులు వాపస్ పోవడం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఊర చెరువు అలుగు కంప తొలగించు మరమ్మతుల పనుల కోసం రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పనులు అధికారులు ప్రారంభించిన కొందరు అడ్డుకోవడం జరిగిందని గ్రామస్తులు వివరించారు. ఊర చెరువును జిల్లా కలెక్టర్ గతంలో పరిశీలించడం జరిగింది. అయినా ఊర చెరువు పనులు ముందుకు సాగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మంత్రం పల్లి గ్రామంలోని ఊర చెరువుకు నిధులు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఎలాంటి పనులు కొనసాగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఊర చెరువులో మరమత్తు పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఊర చెరువు పనులను ఈ నెలాఖరులో చేపట్టకపోతే మంత్రం పల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో యమునంపల్లి గ్రామ స్టేజి వద్ద రైతుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రం పల్లి గ్రామస్తులు రైతులు హెచ్చరిస్తున్నారు.*జిల్లా ఇరిగేషన్ డి ఇ కిరణ్ కుమార్ వివరణ*…నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని మంత్రం పల్లి గ్రామంలో గల ఊర చెరువు మరమ్మతులు పనులపై ఇరిగేషన్ డి కిరణ్ కుమార్ తో నారాయణపేట జిల్లారిపోర్టర్ నేటి సాక్షి జిల్లా రిపోర్టర్ ఇమామ్ తో మాట్లాడుతూ మంత్రం పల్లి గ్రామంలోని ఊర చెరువు పనులను సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. గతంలో పనులు అడ్డుకున్న విషయం తెలిసిందే అన్నారు. ఇట్టి పనులను మరోసారి అడ్డుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉర చెరువు పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు.





