నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలను ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర ఆవేదన రేకెత్తించాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించడం బాధ్యతగా భావించాలనీ, విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో అలాంటి వ్యాఖ్యలు అనవసరమైన ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ మతాల ప్రజలు సమానంగా జీవించే తెలంగాణ వంటి రాష్ట్రంలో అధికార నాయకులు మాట్లాడే ప్రతి మాట ప్రజలపై ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు.*బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్*హిందూ సమాజాన్ని బాధపెట్టిన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, సంయమనంతో వ్యవహరించడం ముఖ్యమని నవీన్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు సహజమైనప్పటికీ, దేవతల గురించి మాట్లాడేటప్పుడు గౌరవం, మర్యాద తప్పనిసరి అని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ సమాజం వ్యక్తం చేసిన నొప్పిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని అభ్యర్థించారు.__





