Monday, March 2, 2026

ముఖ్యమంత్రి సహాయనిధి.. పేద ప్రజలకు ఒక వరం.:— ఎమ్మెల్యే. గీత. జయసూర్య

నేటి సాక్షి 01 మార్చి జూపాడుబంగ్లా:—నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలం తంగెడంచ గ్రామంలో ముఖ్య మంత్రి సహాయనిధి కార్యక్రమం భాగంగా తంగేడంచ సర్పంచ్.కరుణాకర్ రెడ్డి , మరియు జూపాడుబంగ్లా ఎంపిడిఓ.గోపీకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే.గిత్త.జయసూర్య హాజరయ్యారు.ఎంపిడిఓ గోపికృష్ణ.స్వాగతం పలికారు తరువాత గ్రామ స్వర్ణ సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి లక్ష్మణస్వామి బొక్కే ఇచ్చి మరియూ టీడీపీ గ్రామ నాయకులు పెద్దలు పూలమాలలతో శాలువాలతో సన్మానించారు.మరియు తంగేడంచ గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ద్వారా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వారి ఇంటికి వెళ్లి కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేసిన శాసనసభ్యులు గిత్త జయసూర్య మాట్లాడుతూ. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారికి తగిన విధంగా వైద్య సేవలకు మరియు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం పేదల పాలిట, పేదల ఆరోగ్యం బాగుండాలని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అందరికీ అందుబాటులో ఉండేలా అందరూ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలన్న ది కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే గిత్త తెలపడం అయినది. లబ్ధిదారుల వివరాలు తంగడంచ గ్రామానికి చెందిన కొమ్ము వెంకట రవణమ్మ కి 64498/- రూపాయలు మరియు 2. తపేట సురేఖ 26084/- రూపాయలు మరియు 3. గంగోండ చిన్న నాగన్న 101365/- రూపాయలు ఈ కార్యక్రమంలో: మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, కన్వీనర్లు మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, వ్యవసాయ సహకార ఛైర్మన్, పిక్కిలి.శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్.వెంకటేశ్వర్లు, మరియు తంగెడచ గ్రామ సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి లక్ష్మణస్వామి, వెల్ఫేర్ అసిస్టెంట్.సాయి కిరణ్, హెల్త్ సెక్రటరీ వి. శ్వేత, డిజిటల్ అసిస్టెంట్, మంజుల, ఫీచర్ అసిస్టెంట్, హనోకు, సర్వేయర్ తరుణ్, ఆశలు శ్యామలమ్మ రాములమ్మ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News