నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………….,……….,…………….హిందూ దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ . హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా బాధాకరమని అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వెంటనే హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు.





