నేటి సాక్షి: రామడుగు:(పురాణం సంపత్) రామడుగు మండలం వెధిర గ్రామంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో గత పది రోజుల నుండి నిర్వహిస్తున్నటువంటి ఎన్సిసి క్రెడిట్ శిక్షణ శిబిరం గురువారం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి, కమాండర్ సునీల్ అబ్రహం,కల్నల్ ఏకే జయంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు దేశ రక్షణ పట్ల సమగ్రంగా అవగాహన కల్పించడమే కాకుండా వాటిలోని విషయాలను ముఖ్యంగా దేశాన్ని పరిరక్షించే విధానాలను విశ్లేషణాత్మకంగా తెలియజేసినట్లయితే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని అన్నారు.అలాగే జయంత్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో భద్రత అనేది చాలా కీలకమైన అంశం అని అన్నారు.అలాగే విద్యార్థులకు అన్ని రకాలుగా వసతులు కల్పించినటువంటి విద్యా సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.ఇక్కడ అడ్మిన్ ఆఫీసర్ కృష్ణ,సుబేదార్ మేజర్ సాగర్ సింగ్,పాఠశాల సిబ్బంది,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

