నేటి సాక్షి, జగిత్యాల ( ఇమ్మడి విజయ్ కుమార్) : జగిత్యాల పట్టణం శ్రీ కోదండ రామాలయం సన్నిధిలో మంగళవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రత్యేక పండుగలలో ఒకటి అని సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, గొబ్బమ్మలు, పిండి వంటకాలు, పతంగులు గుర్తుకు వస్తాయని అన్నారు. ఇది ప్రకృతిని, వ్యవసాయాన్ని, కుటుంబాన్నీ, సంప్రదాయాలను ఒకే చోట కలిపే పండుగ అని అన్నారు. ఈ మూడు రోజుల పండుగ అందరికి సుఖం, సంతోషం, ఆరోగ్యం మరియు సౌభాగ్యం అందించాలని, ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, శుభ భవిష్యత్తును అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అనురాధ ముప్పల జలజ, రజిత, దీక్షిత, భారతి, రూప, సంధ్య, సంధ్య, స్పందన, నాగరాణి,సరోజ, శైలజ,కవిత,సునీత, రాణి, మంజుల, అరుణ,లక్ష్మీ,భార్గవి, కృష్ణవేణి, లావణ్య, శ్రీదేవి, శ్వేత, కళావతి, గాయత్రి,శిరీష, శ్రీమేధ, తదితరులు పాల్గొన్నారు.

