*నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )రుద్రంగి మండలం మానాల గ్రామంలోని పెద్దమ్మ ఆలయం ఆవరణలో సోమవారం ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షుడు నాంచారి రాకేష్, ఉప అధ్యక్షుడు ఇండ్ల అజయ్ తో పాటు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇటీవల ఉపసర్పంచిగా ఎన్నికైన దాసరి అశోక్ ను ముదిరాజ్ యూత్ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ దాసరి అశోక్ మాట్లాడుతూ… మీరు చేసే మంచి పనుల్లో అండగా ఉంటానని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు కావాలని మీ వంతు కృషి చేయాలని యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ అధ్యక్షులు నాంచారి రాకేష్, ఉప అధ్యక్షులు ఇండ్ల అజయ్, యూత్ సభ్యులు పీసరి రవీంధర్, మాడవేని రాజు, గుర్రపు చందు,నీలం గణేష్, దాసరి శ్రీనివాస్, దాసరి శేఖర్ ,పీసరి చరణ్, పండుగ గణేష్,నీలం స్వామి, రాగుల నవీన్, జలగడుగుల గంగాధర్,పండుగ ప్రవీణ్, దాసరి గణేష్, నాంచారి సిద్దు, సిరికొండ నితిన్, సిరికొండ కార్తీక్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

