నేటి సాక్షి తిరుపతి జనవరి 2 తిరుపతి నగరంలోని అశోక్ నగర్ లో దివంగతురాలు మునెమ్మకు చెందిన షాప్ నెంబర్ 43 రేషన్ షాపును ఆమె బదిలీ చేయాలని బీ హేమంత్ కుమార్ అధికారులను కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న మునెమ్మను సంరక్షకుడుగా చూస్తూ ఆమె అంత్యక్రియలు కూడా నా స్వహస్తాలతో పూర్తి చేశానని మునెమ్మ వారసుడుగా మనవడిగా రేషన్ షాపుకు నామినీ గా మునెమ్మ స్వీకరించిందని ప్రస్తుతం ఆ షాపును వేరే అగ్రకులాలకు చెందిన వారికి ప్రభుత్వం కేటాయించిందని ఆయన వాపోయారు. నేను డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగిని అలాగే నా భార్య అయిన కామేశ్వరి కూడా ఇంటర్ వరకు చదువుకున్నది మేము నిరుపేద ఎస్టి కులమునకు చెందిన వారము మా అవ్వగారైన మునెమ్మ చనిపోయిన అనంతరం అధికారులతో ఆ షాపును నా పేరున బదిలీ చేయాలని అది సమర్పించుకున్నారని అయితే అధికారులు నా దరఖాస్తులు స్వీకరించి లేదని ఆయన ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ ధ్యేయమని నిరుద్యోగులకు భాస్కర్తగా నిలుస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సదరు రేషన్ షాపును నాకు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమావేశంలో హేమంత్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

