నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డు కొంపల్లి గ్రామానికి సంబందించిన బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ సందర్బంగా ఆయన.. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా, సమన్వయంతో ముందుకు సాగుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో పట్టణ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, పట్టణ బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి గ్రామ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

