Monday, January 19, 2026

*మున్సిపల్ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ కీలకపాత్ర పోషించాలి.**అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చెయ్యాలి.**బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ ని బలోపేతం చెయ్యాలి.**జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.*—————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………… రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో మహిళా కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు, చైర్మన్ పీఠం కైవసమే లక్ష్యంగా ప్రతి మున్సిపాలిటీలో ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశం కు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బమ్మ గారు హాజరై, జిల్లలో మహిళా కాంగ్రెస్ కార్యక్రమల పనితీరు, భవిష్యత్ కార్యాచరణ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ పాత్ర, సానిటరీ న్యాప్ కిన్స్ పంపిణి, బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ బలోపేతం తదితర అంశాలపై సమావేశం లో చర్చించగా, అధ్యక్షురాలు విజయలక్ష్మి నివేదిక సమర్పించి, వివరించారు. అనంతరం విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో జిల్లా వ్యాప్తంగా లక్ష్యం మేరకు మహిళలు, యువతులకు ప్రియదర్శిని ఉడాన్ పథకంలో భాగంగా సానిటరీ న్యాప్ కిన్స్ పంపిణి చేయడంతో పాటు మహిళా ఆరోగ్యం, మహిళలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను సైతం వివరించమని తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని పట్టణ, మండలం కమిటీలా సమన్వయముతో క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ బలోపేతం కు చర్యలు గైకొంటున్నామన్నమని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికల నాగరా మోగే పరిస్థితి లో ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జగిత్యాల జిల్లాలో మహిళా కార్యాచరణ సిద్ధం చేసి, ప్రణాళికతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, ప్రతి మున్సిపల్ లో చైర్మన్ పీఠం కైవసమే లక్ష్యంగా సమిష్టిగా ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనెక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశ పెడుతుందని, మహిళా అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు అండగా నిలిచి, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు రూపంగా ప్రజలు తమ మద్దతును తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బమ్మ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, జగిత్యాల పట్టణ ప్రెసిడెంట్, పిప్పరి అనిత, కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ కవిత, మెట్ పెల్లి టౌన్ ప్రెసిడెంట్ హరిత,అల్లాల సరిత, పద్మ సింగరావ్, తాటిపర్తి హరిత రెడ్డి, చరిష్మా రెడ్డి, వల్లెపు రేణుక, రూప తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News