నేటిసాక్షి, కరీంనగర్: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 2 కార్పొరేషన్, 9 మున్సిపాలిటీల్లో పోటీచేస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో 13 మంది సింహం గుర్తుపై గెలిచారని, ప్రస్తుతం టిక్కెట్ల కోసం ఆశావహులు తొలుత పార్టీ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని స్థానాల్లో గెలించేందుకు వ్యూహరచన చేస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ వార్డుమెంబర్లు అతికం రాజశేఖర్ గౌడ్, పి. అరుణ్, జిల్లా కార్యదర్శి అజిత్ రావు, యూత్ లీగ్ రాష్ట్ర కార్యదర్శి రావుల ఆదిత్య, జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, ప్రశాంత్ కుమార్, బొంకూరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

