నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో జరగనున్న ఐదు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.*కౌంటింగ్ కేంద్రం పరిశీలన*ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్‌తో కలిసి కౌంటింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన జగిత్యాల పట్టణంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కౌంటింగ్ హాళ్లు, బ్యారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల అమరిక, స్ట్రాంగ్ రూములు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను వివరంగా పరిశీలించారు.*మార్గదర్శకాలు పాటించాలి* ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా చూడాలని తెలిపారు.*భద్రతపై ప్రత్యేక దృష్టి*కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ఏజెంట్లు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.*అధికారుల సమన్వయం అవసరం*ఎన్నికల కౌంటింగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో జగిత్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.——

