నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ రేపటి నుంచి ప్రారంభమయ్యే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను దృష్టిలో ఉంచుకుని, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ పరిశీలించారు.నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 100 మీటర్ల పరిధి నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరాదని సూచించారు.అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సీఐ బాలాజీ వరప్రసాద్, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు.





