నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు నిర్వహించడం, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నితిక పంత్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వెలుపల 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, క్యూ.ఆర్.టి టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీములు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలకు, అభ్యర్థులకు, గెలిచిన వారికి ఎస్పీ గారు ఈ క్రింది సూచనలు జారీ చేశారు:👉 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.👉 ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం, ఊరేగింపులకు అనుమతి లేదు.👉 శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధం.👉 జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అల్లర్లు, గొడవలు సృష్టించే వారు లేదా అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై రిమాండ్ సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.👉 ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే సంబంధిత అధికారుల ఉత్తర్వుల మేరకు, వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలి.👉 ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ఎన్నికల ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ విజ్ఞప్తి చేశారు.

